Home / Sudan
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సూడాన్ లో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్ ), మిత్రరాజ్యాల అరబ్ మిలీషియా మధ్య జాతి హింసలో గత సంవత్సరం సూడాన్‌లోని వెస్ట్ డార్ఫర్ ప్రాంతంలోని ఒక నగరంలో 10,000 నుండి 15,000 మంది వరకు మరణించారు.
గతకొద్ది కాలంగా అంతర్యుద్దంతో సతమతమవుతున్న సూడాన్‌లోని తొమ్మిది శిబిరాల్లో గత ఐదు నెలల్లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1,200 మంది పిల్లలు మరణించారని యునైటెడ్ నేషన్స్ యొక్క శరణార్థి ఏజెన్సీ తెలిపింది. ఇవన్నీ మీజిల్స్ మరియు పోషకాహారలోపం కారణంగా జరిగాయని పేర్కొంది.
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఆదివారం బహిరంగ మార్కెట్‌పై డ్రోన్ దాడిలో కనీసం 30 మంది మృతిచెందారు. గత కొద్దికాలంగా దేశంపై నియంత్రణ కోసం సైన్యం మరియు శక్తివంతమైన పారామిలిటరీ బృందం రెండూ పోరాటానికి దిగాయి. అయితే ఈ డ్రోన్ దాడి ఎవరివల్ల జరిగిందనేది తెలియలేదు.
ఆపరేషన్ కావేరి కింద న్యూఢిల్లీలో అడుగుపెట్టిన భారతీయులు, భారత సైన్యం యొక్క ప్రయత్నాలను మరియు ప్రభుత్వ ఏర్పాట్లను ప్రశంసించారు.ఢిల్లీ విమానాశ్రయం వెలుపల నిర్వాసితులైన వారు దేశాన్ని, సైన్యాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ నినాదాలు చేశారు.
అంతర్గతయుద్దంతో సతమతమవుతున్న సూడాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రారంభమయింది. మొదటి బ్యాచులో భాగంగా ఆపరేషన్ కావేరి కింద ఐఎన్ఎస్ సుమేధ నౌకలో278 మంది సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలు దేరారు.
సూడాన్‌లో కొనసాగుతున్న ఘర్షణల్లో 400 మందికి పైగా మరణించగా 3,351 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దేశ సైన్యం మరియు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా ఇతర దేశాలకు చెందిన పలువురు చిక్కుకు పోయారు. వీరిని అక్కడనుంచి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు కీలకమైన నోటీసును జారీ చేసింది, దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఇంట్లోనే ఉండమని సలహా ఇచ్చింది. కాల్పులు మరియు ఘర్షణల దృష్ట్యా, దౌత్య కార్యాలయం భారతీయులను ఇంటి లోపలే ఉండాలని బయటికి వెళ్లడం మానేయాలని కోరింది.