Home / States
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మరియు జూన్ నెలలకు సంబంధించి జీఎస్టీ నష్టపరిహారంగా కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు రూ. 17,000 కోట్లు విడుదలచేసింది.
ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189 కోట్లువిడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కర్ణాటక (రూ. 628.07 కోట్లు), త్రిపుర (రూ. 44.10 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ. 2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 569.01 కోట్లు), గుజరాత్ (రూ. 708.60) లకు కేంద్రం ఈ గ్రాంట్లు విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.1.17 లక్షల కోట్లను విడుదల చేసింది, ఇది సాధారణంగా బదిలీ అయ్యే దానికంటే రెట్టింపు."రాష్ట్రాల మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను బలోపేతం చేయడానికి ఇది భారత ప్రభుత్వ నిబద్ధత