Home / Sri Lanka Crisis
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద భారతదేశం ఆదివారం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందచేసింది. కొలంబో అన్నారు.శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే 44,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రావడం గురించి తెలియజేయడానికి వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిశారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.