Home / Sonali Phogat
బీజేపీ నేత సోనాలి ఫోగట్ కేసు లో సీబీఐ మంగళవారం తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
నటి సోనాలి ఫోగట్ కేసుకు సంబంధించి గోవా పోలీసులు శుక్రవారం హర్యానాలోని హిసార్‌లోని ఫోగట్ నివాసం నుండి మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఫోగట్ ,ఆమె సహాయకుడు సుధీర్ సంఘ్వాన్ మధ్య డబ్బు లావాదేవీలు జరిగినట్లు పోలీసులకు దొరికిన డైరీల ద్వారా తెలిసింది.
సోనాలి పోగాట్ హత్య జరిగి సుమారు పది రోజులు కావస్తోంది. విచారణలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం సోనాలి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాత్రం ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్.
హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతికి సంబంధించి క్లబ్ యజమాని, డ్రగ్స్ వ్యాపారి సహా మరో ఇద్దరిని గోవా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. క్లబ్ వాష్‌రూమ్‌లో డ్రగ్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ యొక్క స్వభావం ఇంకా ధృవీకరించబడలేదు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే ఈ డ్రగ్ ఏంటన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం పట్ల కుటుంబసబ్యుల అనుమానాలు నిజమయ్యాయి. ఆమె పీఏ. అతని స్నేహితుడు కలిసి ఆమె చేత బలవంతంగా మత్తు పదార్దం తినిపించారని అది ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై పలు గాయాలు" ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొనడంతో ఆమె మృతిపై గోవా పోలీసులు గురువారం హత్య కేసు నమోదు చేశారు. ఫోగట్ 42, ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు.
బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ గోవాలో సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. అయితే సోనాలి కుటుంబ సబ్యలు మాత్రం ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు సీబీఐ విచారణ కోరుతున్నారు.