Home / sexual harassment
బీహార్‌లోని నలంద జిల్లా పావపురిలోని వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని నలుగురు వైద్యులు మరియు ఒక క్లర్క్‌పై పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు వైవా పరీక్షలలో మెరుగైన గ్రేడ్ల కోసం కనీసం ముగ్గురు విద్యార్దినుల నుండి లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు నలంద జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
:హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై 142 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మొదట్లో 60 మంది విద్యార్థినులు అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరుకుంది. లైంగిక వేధింపుల కమిటీ విచారణలో ఈ విషయం వెల్లడయింది.
యునైటెడ్ కింగ్ డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్ ( ఎన్ హెచ్ ఎస్ )లో ప్రతీ ముగ్గురు మహిళా సర్జన్లలో ఒకరు గత ఐదేళ్లలో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ సర్వేను సభ్యులు శస్త్రచికిత్స కోసం #MeToo ఉద్యమం"గా అభివర్ణించారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీ నిర్వహించిన సర్వేలో బీబీసీ మరియు టైమ్స్ నివేదికల ప్రకారం 11 అత్యాచార సంఘటనలు కూడా ఉన్నాయి.
ముంబై-గౌహతి ఇండిగో విమానంలో మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసి గౌహతిలో పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను అందించాలని ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరినట్లు సమాచారం.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్థానిక కోర్టులో సమర్పించిన దర్యాప్తుపై తమ స్టేటస్ నివేదికలో తెలిపారు.
మూడు నెలలు కావస్తున్నా తమకు న్యాయం జరగలేదని అందుకే మళ్లీ నిరసన తెలుపుతున్నామని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా పలువురు రెజ్లర్లు అన్నారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి వారు మీడియాతో మాట్లాడారు.
చెన్నై కు చెందిన కళాక్షేత్ర ఫౌండేషన్ అధీనంలోని రుక్మిణీ దేవి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్‌పై చెన్నై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసారు.
జనగాన జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ... తనపై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.