Home / Rushi Sunak
వలస పేరుతో భారతదేశానికి వచ్చి, మనలను బానిసలుగా చేసిన బ్రిటిష్ దేశానికి ఇప్పుడు భారత సంతతి వ్యక్తి , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ప్రధాని కావడం గర్వకారణం. సుమారు 200 ఏళ్లు మనల్ని పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు మనవాడు పరిపాలించనున్నాడు. అందులోనూ దీపావళి రోజే రిషి ఎన్నిక కావడం మరో విశేషం. ఈరోజు మనవాడు బ్రిటన్ ప్రధాని అవ్వడంతో ఇది కదా మనకు అసలైన దీపావళి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయనకు ఇండియాతో ఉన్న అనుబంధం ఏంటి? బ్రిటన్ కొత్త ప్రధాని పూర్వీకుల మూలాలు ఇండియాలో ఉన్నాయి. రుషి సునక్ జీవిత ప్రస్థానంపై ప్రైమ్9 స్పెషల్ స్టోరీ.
యునైటెడ్ కింగ్డమ్లో రిషి సునక్ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడంపై భారత్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మన దేశ మూలాలు కల్గిన వ్యక్తి, యునైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధాని రుషి సునాక్ కు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. 10 అంశాలతో రుషి సునాక్ గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి.
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధాన మంత్రిగా లిజ్ ట్రుస్ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ సభ్యుల్లో అత్యధికులు లిజ్ వైపు నిలిచారు. దీంతో రుషి ఆమె కన్నా 32 పాయింట్లు వెనుకబడి ఉన్నారు.