Home / Revanth Reddy
మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల పై మండిపడుతూ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిపి గొయ్యి తీసి దానిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
భారత్ జోడో యాత్రతో భాజాపా దేశంలో పెద్ద చర్చనే లేవదీసింది. అది కాస్తా రాష్ట్రాలకు కూడా పాకింది. తాజాగా తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో కాంగ్రెస్ శాసనసభ్యులు జగ్గారెడ్డి వేసుకొన్న షర్ట్ పై ఆసక్తికర సంభాషణ సాగింది.
కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో కలిసి పని చేయాలని వారికి సూచించారు.
అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాన్ని బలహీన పరిచారని ఫైరయ్యారు.
టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది.
భారత్ జోడో యాత్రపై కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్రపై అందరికీ సూచనలు చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి వ్యాఖ్యలను అద్దంకి దయాకర్ తప్పు బట్టారు. సీనియర్ నాయకుడిగా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దని విమర్శించారు. పీసీసీ, ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.