Revanth Reddy: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లపై మండిపడుతున్న రేవంత్ రెడ్డి
మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల పై మండిపడుతూ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిపి గొయ్యి తీసి దానిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Munugode: మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల పై మండిపడుతూ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిపి గొయ్యి తీసి దానిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో టీఆరఎస్ ఏమి చేసిందో చెప్పాలని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మునుగోడు బాగుపడేదని, టిఆర్ఎస్, బిజేపి పార్టీలు మళ్ళీ ప్రజలను మభ్య పెట్టి వాళ్ళ చేత ఓట్లు వేపించుకోవడానికి సిద్ధమవుతున్నారని, ఇలాంటి వేషాలు వేసే వారిని ప్రజలు నమ్మరని, ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో కనీసం ఒక్కటి కాకపోయినా ఒక్కటి ఐనా నెరవేర్చారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
శివన్నగూడెం ప్రాజెక్టు వారికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇచ్చిన పరిహారమే వాళ్ళకి కూడా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసి మండిపడుతూ గజ్వేల్, సిరిసిల్ల రైతులకు మాత్రమే పధకాలను ప్రవేశ పెడితే మిగతా రైతు అన్నదమ్ములు గోడును ఎవరు పట్టించుకుంటారు అంటే వాళ్ళు దేవుళ్ళగా నల్గొండను వాళ్ళు రాక్షసులుగా కనిపిస్తున్నారా అంటూ విమర్శించారు. ఇప్పటికైనా పాలమూరు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే ప్రజలు పడుతున్న కష్టాలు గట్టేక్కి తాయని తెలిపారు.
రైతుల కష్టాలను పట్టించుకుంటా అని ఆనాడు మాట ఇచ్చి ఈనాడు మొహం చాటేస్తే ఈ సారి మీకు ప్రజలే సరియిన గుణపాఠం చెప్తారని, ప్రధాని మోదీ, రైతులను సుఖ పెట్టకుండా ఇంకా కష్టాల పాలయ్యేలా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల మీద మండిపడ్డారు.