Home / Restored
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ లోక్సభలో అడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
హర్యానాలోని నుహ్ మరియు రాష్ట్రంలోని మరికొన్ని ప్రదేశాలలో మొబైల్ ఇంటర్నెట్ మరియు ఎస్ఎంఎస్ సేవలను గురువారం మధ్యాహ్నం ఒంటిగంటనుండి మూడు గంటలపాటు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.మత ఘర్షణల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు.
లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. 10 ఏళ్ల జైలు శిక్షతో కూడిన క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో జనవరిలో ఫైజల్ లోక్సభ సభ్యత్వం రద్దయింది. దీనితో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగనుంది.