Home / Rajeev Chandrasekhar
సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ను మూసివేస్తామని భారతదేశం బెదిరించిందని పేర్కొన్న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై కేంద్రం ఎదురుదాడి చేసింది. 2021లో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సే, ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాలను, రైతుల నిరసనలపై నివేదించే వారి ఖాతాలను సెన్సార్ చేయమని, అలాగే ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తామని భారతదేశం నుండి బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు.
దేశంలో మూడు రకాల ఆన్లైన్ గేమ్‌లను ప్రభుత్వం అనుమతించదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. నిషేధించబడే మూడు రకాల గేమ్‌లలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ మరియు వ్యసనానికి సంబంధించిన గేమ్‌లు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.ఆన్లైన్ గేమింగ్ కోసం ప్రభుత్వం తొలిసారిగా ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసిందన్నారు.