Home / Rabri Devi
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మిసా భారతి, హిమా యాదవ్, హృద్యానంద చౌదరి, అమిత్ కత్యాల్ పేర్లు ఉన్నాయి. ఛార్జిషీట్లో రెండు సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం భూములు కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది.ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమార్తె డాక్టర్ మిసా భారతికి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు లాండ్స్ ఫర్ జాబ్స్ కేసులో బెయిల్ మంజూరు చేసింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ప్రశ్నిస్తున్నారు.