Home / Queen Elizabeth II
బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్లోని ఆమె బాల్మోరల్ కాజిల్లో మరణించారు. 1,116 కోట్ల విలువైన ఈ విశాలమైన కోటకు దివంగత రాణి యజమాని. బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటిగా ఉంది.
బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ II మరణం కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద వజ్రం కోహినూర్ ఇపుడు చేతులు మారనుంది.
96 సంవత్సరాల వయస్సులో మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II వద్ద 105 క్యారెట్ల వజ్రం 'కోహినూర్'తో సహా అనేక విలువైన రత్నాలు మరియు ఆభరణాలనుఉన్నట్లు తెలిసింది. అందులో ఒకటి దాదాపు 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినం నెక్లెస్ సెట్.
యునైటెడ్ కింగ్డమ్ జాతీయ జీవితంలో రాచరికం విడదీయరాని భాగం. మరియు చక్రవర్తి యొక్క చిత్రం, చిహ్నాలు మరియు రాచరిక కోడ్ ప్రజల రోజువారీ జీవితాలతో సంక్లిష్టంగా ముడిపడి ఉన్నాయి.
క్వీన్ ఎలిజబెత్ II యొక్క మరణానంతర ప్రణాళికకు లండన్ బ్రిడ్జ్ అనే సంకేతనామం పెట్టబడింది. కానీ చక్రవర్తి స్కాట్లాండ్లో ఉన్నప్పుడు చనిపోతే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. దీనిని ఆపరేషన్ యునికార్న్ అని పిలుస్తారు.
సూర్యుడస్తమించని రాజ్యంలో గాడాంధకారం నెలకొనింది. గ్రేట్ బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్-2 ఇక మన మధ్య లేరు. అనారోగ్య సమస్యల దృష్ట్యా గురువారం రాత్రి ఆమె స్కాట్లాండ్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.