Home / pubs
హైకోర్టు ఉత్తర్వులను సైతం పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా అనుకొన్నది వారు చేసేస్తున్నారు. దీంతో రెండు పబ్బుల పై హైదరాబాదు పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఓ వైపు మైనర్లకు పబ్బుల్లో ప్రవేశాలు, మరో వైపు నిత్యం ఎక్కడో ఓ చోట జరిగే అసాంఘిక వ్యవహారాలకు హైదరాబాదు పబ్ లు కేరాఫ్ గా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అధికారులకు ప్రభుత్వ పెద్దలు అడ్డు తగులుతూ ఉంటారు. దీంతో పర్యవేక్షణ పోలీసులకు సాధ్యం కాని పనిగా మారింది.
భాగ్యనగరంలోని పబ్స్ నిర్వహణ పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటలకు ఎలాంటి డిజేలు ఉండకూడదని మద్యంతర ఆదేశాలు జారీ చేసింది.