Home / PSLV C56 rocket
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C 56 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించారు. ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం 6.30 గంటలకు PSLV C-56 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.