Home / Protests
హిట్-అండ్-రన్' నిబంధనపై డ్రైవర్లు మరియు ట్రక్కర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వివిధ రాష్ట్రాలలో నిరసనలు వెల్లువెత్తాయి. వీరి ఆందోళన రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాను దెబ్బతీస్తుందనే భయంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో రాష్ట్రాలలో పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు క్యూలు కట్టారు.
టి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ దక్కనివారు నేరుగా గాంధీ భవన్‌నే టార్గెట్ చేస్తున్నారు. దీంతో రోజూ గాంధీ భవన్ గేట్లకి తాళాలు వేస్తున్నారు. తాజాగా గాంధీ భవన్ వద్ద భద్రతని పెంచారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులని రంగంలోకి దించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్దుల మృతిపై హింసాత్మక నిరసనలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రదర్శనలలో భాగంగా ఇంఫాల్ వెస్ట్‌లో ఒక గుంపు రెండు నాలుగు చక్రాల వాహనాలను తగులబెట్టింది . అంతేకాదు డిప్యూటీ కమీషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది.
కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుచ్చిలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కావేరీ జలాల వివాదంపై రైతులు తమ నిరసనకు గుర్తుగా నోటివద్ద చనిపోయిన ఎలుకలు పెట్టుకున్నారు.
.పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్తంగా అతని మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం మరియు లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ నివాసంపై దాడి చేశారు. ఖాన్ మద్దతుదారులు గుజ్రాన్వాలా కంటోన్మెంట్ ప్రవేశాన్ని తగులబెట్టారు