Home / poaching case
తెరాస పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందుతుడు రామచంద్రభారతి పై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
దేశంలో బీజేపీ దుర్మార్గాలు చేస్తుంది.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు పక్కా ప్లాన్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు నిందితుల ఆడియో, వీడియో టేపులను అందరికి పంపించారు.
తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసులో నిందుతులు కీలక అంశాలు పేర్కొన్నట్లు సీఎం కేసిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, ఇప్పుడు ఇంకో నాలుగు ప్రభుత్వాలను కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నామని నిందితులు తెలిపారన్నారు
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ కేసుపై మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో పాన్ ఇండియా సినిమా తరహాలో చూస్తారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని, నిర్గాంతపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. ఈమేరకు కేసిఆర్ మీడియాతో ముచ్చటించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసులోని నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు ముగ్గురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.