Home / PM Modi
భారత రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఈ నెల 25న ప్రమాణం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్‌కు ఘనంగా వీడ్కోలు పలకనుంది.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.
దేశం వేగంగా అభివృద్ది చెందడానికి 'సబ్కా ప్రయాస్' పునాది అని ప్రధాని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూరత్ లో జరుగుతున్న నేచురల్ ఫార్మింగ్ కాన్క్లేవ్ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా, దేశం వివిధ లక్ష్యాల కోసం పని చేయడం ప్రారంభించిందన్నారు.