Home / Petition
టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, (నీట్) పరీక్ష సందర్బంగా తన ఒఎంఆర్ షీటును పాడుచేసి ఇబ్బందిపెట్టినందుకు దిశా శర్మ అనే యువతి పరీక్ష ఇన్విజిలేటర్పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
భారత రాష్ట్రపతిచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా లోక్సభ సెక్రటేరియట్ మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ని హన్మకొండ కోర్టు డిస్మిస్ చేసింది. ప్రాసిక్యూషన్ వాదనలతోవిబేధించిన మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ని తోసిపుచ్చింది. పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణకి సహకరించడం లేదని పిపి వాదించారు.
రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.న్యాయవాది అశోక్ పాండే దాఖలు చేసిన ఈ పిటిషన్ లో భక్తుల సౌకర్యార్థం సంబంధిత స్థలంలో గోడను నిర్మించాలని కోరారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసులోని నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు ముగ్గురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
ఉన్న కేసుల్లోనే పలు మొట్టికాయలు తింటున్న ప్రభుత్వ పనితీరు మారదంటూ ఏపీ హైకోర్టులో మరో కేసు దాఖలైంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల కమీషన్ కు సర్వోత్తమ న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.