Home / people killed
యెమన్‌లో బోటు మునిగిపోవడంతో సుమారు 49 మంది మృతి చెందగా 140 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మృతి చెందిన వారిలో అత్యధికంగా మహిళలు, చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు.
శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు లోయలో పడటంతో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. బస్సు పంజాబ్‌లోని రావల్పిండి ప్రావిన్స్ నుండి హుంజాకు వెళ్తుండగా గిల్గిట్-బాల్టిస్తాన్లోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో పది మంది మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు శనివారం తెలిపారు. దీనిని బొగ్గు మరియు గ్యాస్ పేలుడు విస్ఫోటనం గా వర్ణించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:55 గంటలకు పింగ్డింగ్షాన్లో ఈ ప్రమాదం జరిగింది.
నేపాల్‌లోని లుంబినీ ప్రావిన్స్‌లో ఉన్న రప్తి నదిలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులతో సహా కనీసం 12 మంది మరణించారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, బస్సు నేపాల్‌గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా, భలుబాంగ్‌లోని రప్తి వంతెనపై నుండి ఈస్ట్-వెస్ట్ హైవే వెంబడి నదిలోకి పడిపోయింది.
జపాన్‌లో కొత్త ఏడాది మొదటిరోజే బలమైన భూకంపాలు సంభవించిన సుమారుగా 30 మంది మరణించారు. సోమవారం జపాన్ 155 భూకంపాలతో దెబ్బతింది, వీటిలో ప్రారంభ భూకంపం తీవ్రత 7.6 కాగా పలు భూకంపాలు 6 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించాయని జపాన్ వాతావరణ కార్యాలయం తెలిపింది.