Home / Patancheru
చిరుతలు, పులులు అటవీ ప్రాంతాల నుంచి ప్రజావాసాల్లోకి వచ్చి జనాల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే అడవి మృగాలు కూడా కాస్త ట్రెండ్ మార్చినట్టు ఈ సారి నివాస ప్రాంతాల్లోకి కాకుండా హెటిరో పరిశ్రమలో చిరుత ప్రవేశించింది.
చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా పటాన్‌చెరు టీఆర్ఎస్ రాజకీయం రసకందాయంలో పడింది. చిట్కుల్‌లో జరిగిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హజరు కాకపోవడం టీఆర్‌ఎస్‌లో గ్రూప్ విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది.
పటాన్‌చెరు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి టీఆర్‌ఎస్ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తలనొప్పిగా మారారన్న టాక్ వినిపిస్తోంది.
పటాన్‌చెరు నియోజకవర్గంలో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. గూడెం బ్రదర్స్ జోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి వ్యూహత్మకంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి వర్గం ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ దూసుకెళ్తున్నారు.