Home / palestine
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరౌరీని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు.
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
ఇజ్రాయెల్‌కు పొరుగున ఉన్న పాలస్తీనా పౌరులు ఉపాధి కోసం ఇజ్రాయెల్‌పై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నయుద్ధం క్రమంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగం పాలస్తీనా ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న పాలస్తీనాకు భారతదేశం ఆదివారం మానవతా సాయం పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్లీనాకు చేరుకుంటాయి.
పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసిన హమాస్ తమ అధీనంలో ఉన్న ఒక యువతి వీడియోను విడుదల చేసింది. అందులో ఒక యువతి గుర్తు తెలియని ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతున్నట్లు చూపించారు. సదరు యువతి తనను తాను షోహమ్కు చెందిన మియా షెమ్ అని పరిచయం చేసుకుంది.
ఇజ్రాయెల్ లో అసహజ మరణాలకు గురైన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే జకా అనే సంస్థలో యోస్సీ అనే కార్యకర్త పనిచేస్తున్నాడు. అతను తాజాగా యుద్ద సమయంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల స్డెరోట్‌లో ఒక ఇజ్రాయెల్ మహిళ శవాన్ని తాను కనుగొన్నానని, ఆమె కడుపును చీల్చి శిశువును హమాస్ ఉగ్రవాదులు కత్తితో పొడిచి చంపారని చెప్పాడు.
ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. వేడుకలకు హాజరయ్యి 21 మంది సజీవదహనం అయ్యారు. అందులో 17 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఆవేదనకరం. ఈ దుర్ఘటన పాలస్తీన గాజాలోని శరణార్థుల శిబిరంలో చోటుచేసుకుంది.