Published On:

Maoists Surrendered: ఛత్తీస్ గఢ్ లో 13 మంది మావోల లొంగుబాటు

Maoists Surrendered: ఛత్తీస్ గఢ్ లో 13 మంది మావోల లొంగుబాటు

Chattisgarh: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోస్టులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. మావోలను రూపుమాపడమే లక్ష్యంగా భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు కీలక నేతలు చనిపోయారు. పెద్ద సంఖ్యలో మావోలు చనిపోయారు. దీంతో మావోల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మావోలు పోలీసుల ముందు లొంగిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే పలువురు మావోలు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మరికొందరు పోలీసుల ముందుకు వచ్చారు.

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 8 మంది మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 23 లక్షల రివార్డ్ ఉందని అధికారులు తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోలకు పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

లొంగిపోయిన మహిళల్లో ఒకరు దేవ్ ముచాకి అలియాస్ ప్రమీల (21) మీద రూ. 8 లక్షల రివార్డ్ ఉంది. ఇక ధమ్తారి- గరియాబంద్- నువాపాడ డివిజన్ పరిధిలోని ఏరియా కమిటీ సభ్యుడైన కోసా ఓయం అలియాస్ రాజేంద్ర అలియాస్ మహేష్ అలియాస్ మహేష్ సాగర్ అలియాస్ రమేష్ (29) మీద రూ. 5 లక్షల రివార్డ్ ఉంది. అలాగే కోసి పోడియం మీద రూ. 2 లక్షలు, సమ్మి సెమ్లా, ఛోటూ పార్సిక్ అలియాస్ దీపక్, మోతీ తాటి, సునీత హేమ్లా, మంజుల కుంజమ్, సైబో పొడియం, హంగీ ఉండుమ్ అలియాస్ రాధ మీద ఒక్కక్కరికి రూ. లక్ష చొప్పున రివార్డు ఉంది. మిగతా ముగ్గురికి ఎలాంటి పారితోషకం లేదని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: