Home / Opposition parties
తమ ఐఫోన్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ అలర్ట్ హెచ్చరికలు అందుకున్నామని భారతదేశంలోని పలువురు ప్రతిపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలపై టెక్ దిగ్గజం యాపిల్ స్పందించింది. శశి థరూర్, మహువా మోయిత్రా, రాఘవ్ చద్దా, ప్రియాంక చతుర్వేది, రాహుల్ గాంధీ మరియు ఇతరులతో సహా ఎంపీలు యాపి పంపిన సందేశాల స్క్రీన్షాట్లను పంచుకున్నారు.
ఆదివారం న్యూ ఢిల్లీలో భారతదేశం యొక్క కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి తాము హాజరుకావడం లేదని 19 రాజకీయపార్టీలు ప్రకరటించాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), వామపక్షాలు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), జనతాదళ్-యునైటెడ్ (జెడియు), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), సమాజ్వాదీ పార్టీ, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం బుధవారం ఈ విషయాన్ని తెలిపారు.
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఈడీ, సీబీఐలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
నిందితులకు తగిన గుణపాఠం పేరుతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్య నాధ్ తీసుకొచ్చిన బుల్ డోజర్ వ్యవస్ధను భాజాపా మద్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలుపరిచింది. ఈమేరకు ఓ సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందుతుల ఇండ్లను బుల్ డోజర్లతో కూల్చివేసి ప్రజల ప్రభుత్వంగా చెప్పుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమైనాయి.