Home / North India Floods
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న వరదల నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మరణించిన వారి సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో 90కి చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 39 మరణాలు నమోదయ్యాయి.
భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఉత్తర భారతదేశం లో మరో 20 మరణాలు నమోదయ్యాయి. దీనితో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 100 కు చేరింది.హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 31కి చేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 80 మంది మరణించారు
ఉత్తర భారతంలోదేశరాజధాని ఢిల్లీతో సహా పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి.ఢిల్లీ ఎన్సిఆర్కి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు, దేశ రాజధాని ప్రాంతం అంతటా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పంజాబ్ మరియు హర్యానా లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.