Home / natiotional news
గ్యాంగ్‌స్టర్ అబు సలేంను ముంబై బాంబు పేలుళ్ల కేసులో విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి అబ సలేం 25 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేశారు. మంబై బాంబు పేలుళ్లకు సంబంధించి నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కేంద్రప్రభుత్వం పోర్చుగల్ ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చిందని అబు సలేం గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. కాగా కొత్త పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని ఆవిష్కరించారు. నిర్మాణపనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
అన్నాడీఎంకే లో మరోసారి రచ్చ మొదలైంది. పార్టీ కార్యాలయాల వద్దే ఇరు వర్గాల కార్యకర్తుల బాహాబాహీకి దిగారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అన్నాడీఎంకే పై పట్టు కోసం అటు పన్నీర్ సెల్వం, ఇటు ఎడప్పాడి పళనిస్వామి రెండు వర్గాలుగా చీలిపోయారు. పార్టీ ఒకరి చేతిలోనే ఉండాలని పళని స్వామి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.