Home / national news
సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో తనపై బూట్లు విసరడంతో రాజస్థాన్ క్రీడా మంత్రి అశోక్ చంద్నా కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాపై షూ విసిరి సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అయితే, అతన్ని త్వరగా చేయాలి. ఎందుకంటే ఈ రోజు నాకు పోరాడాలని అనిపించడం లేదు.
బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తాను తన శాఖలో 'దొంగలకు సర్దార్' నంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ రైతులను ఆదుకుంటామనే పేరుతో దాదాపు రూ.200 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) మాజీ మంత్రుల ఇళ్లపై ఈరోజు విజిలెన్స్ దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డివిఎసి) అధికారులు ఎఐఎడిఎంకె నాయకుడు ఎస్ పి వేలుమణికి చెందిన 26 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
అహ్మదాబాద్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతడిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ని తన ఇంట్లో డిన్నర్ చేయమని అభ్యర్థించాడు.
కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ మరియు వారణాసిలోని ఆలయ సముదాయానికి భద్రత మరియు నిఘా అవసరాలను విశ్లేషించడానికి మరియు నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రత్యేక భద్రతా కన్సల్టెన్సీ వింగ్ సిఐఎస్ఎఫ్ ను నియమించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
దేశంలోని 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ రహదారులు రానున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో గడ్కరీ ఈ మాటలు పేర్కొన్నారు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ పర్యటనలో ఊహించని ఆహ్వానం ఎదురయింది. అహ్మదాబాద్‌లో ఆటో రిక్షా డ్రైవర్ల సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు, వారిలో ఒక ఆటోడ్రైవర్ కేజర్ీవాల్ ను డిన్నర్ కు ఆహ్వానించారు.
జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్ కేసులో హిందూ పక్షం పిటిషన్‌ను కొనసాగించడాన్ని వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం సమర్థించింది.
దేశవ్యాప్తంగా మద్య నిషేద చట్టాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం విముఖుత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమకు తాముగా నియంత్రిస్తున్నందున, దేశ వ్యాప్తంగా మద్యపాన నిరోధక విధాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు.