Last Updated:

Arvind Kejriwal: ఆటోడ్రైవర్ ఇంట్లో భోజనం చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

అహ్మదాబాద్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతడిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ని తన ఇంట్లో డిన్నర్ చేయమని అభ్యర్థించాడు.

Arvind Kejriwal: ఆటోడ్రైవర్ ఇంట్లో భోజనం చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Ahmedabad: అహ్మదాబాద్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతడిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ని తన ఇంట్లో డిన్నర్ చేయమని అభ్యర్థించాడు.

ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనానికి వచ్చిన ఆహ్వానాన్ని నేను అంగీకరించాను. నేను అతని కుటుంబాన్ని కూడా కలుసుకున్నాను. ఇంటి ఆహారం రుచి చూసాను. నేను అతని కుటుంబాన్ని ఢిల్లీకి ఆహ్వానించాను అంటూ కేజ్రీవాల్ డిన్నర్ తర్వాత చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ మమ్మల్ని డిన్నర్‌కి ఆహ్వానించారు మేము ఖచ్చితంగా వెళ్తాము” అని ఆటో డ్రైవర్ భార్య నిషా మీడియాకు తెలిపారు. ఢిల్లీ సిఎంకు భోజనం వడ్డిస్తున్నప్పుడు మీరు కంగారుగా ఉన్నారా అని అడిగినప్పుడు, “నేను అస్సలు భయపడలేదు. నేను రోజూ వండే ఆహారాన్నే నేను అతని కోసం సిద్ధం చేసాను” అని ఆమె చెప్పింది.

అయితే, డ్రైవర్ ఇంటికి వెళ్లే ముందు కేజ్రీవాల్ సోమవారం రాత్రి తన హోటల్ వెలుపల భద్రతా ప్రోటోకాల్‌ల పై పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కేజ్రీవాల్ విక్రమ్ దంతాని ఇంటికి వెళుతుండగా భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే కేజ్రీవాల్ తన భద్రతకు తానే బాధ్యత వహిస్తానని పేర్కొంటూ ఒక అండర్‌టేకింగ్‌ పై సంతకం చేయడంతో వెళ్లడానికి పోలీసులు అనుమతించారు.

 

follow us

సంబంధిత వార్తలు