Motorola Edge 50 Neo Offers: మోటో ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్.. ఆఫర్స్ అదిరిపోయాయ్.. ఫీచర్స్ పిచ్చెక్కించాయ్..!

Motorola Edge 50 Neo Offers: మోటరోలా ఎడ్జ్ 50 నియో ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎంచుకున్న బ్యాంక్ క్రెడిడ్, డెబిట్ కార్డులపై 5 శాతం అదనపు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 28 వరకు ఈ సేల్ లైవ్ అవుతుంది. మీరు మోటరోలా అభిమానులు అయితే ఈ డీల్ మిస్స్ అవ్వకండి. ఈ ఫోన్ మీరు కొనాలని చూస్తుంటే ఫోన్‌పై ఉన్న డీల్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్ సేల్ జరుగుతుంది. ఫిబ్రవరి 28 వరకు జరిగే ఈ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 50 నియోను తక్కువ ధరకే ఆర్డర్ చేయచ్చు. కంపెనీ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.20,999కి లాంచ్ చేసింది. ఈ క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. పొడిగించిన ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 13, 700 తగ్గించచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ స్థితిపై ఆధారపడి ఉంటుంది.
Motorola Edge 50 Neo Features
కంపెనీ ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్. మీరు ఫోన్‌లో డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3ని కూడా చూస్తారు. ఫోన్ MIL-STD 810H బిల్డ్, IP 68 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది . ప్రాసెసర్‌గా, మీరు ఈ ఫోన్‌లో డైమెన్షన్ 7300 చిప్‌సెట్‌ని చూడవచ్చు.
ఫోటోగ్రఫీ కోసం, కంపెనీ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అదే సమయంలో కంపెనీ ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్ బ్యాటరీ 4310mAh, ఇది 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS విషయానికొస్తే ఫోన్ ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తుంది.