Home / national news
సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కూడా కలిసారు.
ఢిల్లీ ప్రభుత్వం 1,000 బస్సులను కొనుగోలు చేయడంలో జరిగిన అవినీతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తుకు రంగం సిద్దమయింది. జూన్‌లో అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్కుమార్ సీబీఐ దర్యాప్తుకు విజ్ఞప్తి చేశారు.
జ్ఞాన్వాపి మసీదు మరియు దాని చుట్టుపక్కల భూముల పై దాఖలయిన సివిల్ దావాల పై వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. ఈ నేపధ్యంలో వారణాసిలో నిషేధాజ్ఞలు కఠినతరం చేయబడ్డాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముఠాలు మరియు క్రైమ్ సిండికేట్లను అణిచివేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) సోమవారం భారతదేశంలోని 60 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఢిల్లీహర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.
రాహుల్ గాంధీకి తమిళ అమ్మాయితో పెళ్లి చేస్తామని ముందుకు వచ్చిన తమిళ మహిళలు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు... అసలు ఈ సన్నివేశం ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.
ఓనం పండుగకు ముందు వారంలో కేరళీయులు రూ. 624 కోట్ల విలువైన ఆల్కహాల్‌ను తాగేసారు. దీనితో రాష్ట్రంలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2021లో రూ.529 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దివంగత జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గారిసన్ గా పేరు పెట్టారు. శనివారం జరిగిన కార్యక్రమంలో, స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గ్రాండ్ గేట్ ను ఆవిష్కరించారు. వాలాంగ్ నుండి కిబితు వరకు 22 కి.మీ పొడవైన రహదారిని అరుణాచల్ ప్రదేశ్ సిఎం పెమా ఖండూ 'జనరల్ బిపిన్ రావత్ మార్గ్'గా అంకితం చేశారు.
ఎగుమతులు అసాధారణంగా పెరగడం, దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గడం వంటి కారణాలతో నూకలు (విరిగినబియ్యం) ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. నూకల ధర ధర సుమారు రూ. 15-16 (కిలోకి) మరియు తరువాత రూ. 22కి పెరిగింది.
గణనాథునికి 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఎంతో సందడిగా గణేషునికి వీడ్కోలు పలుకుతుంటాము. కాగా హర్యానాలో నిర్వహించిన బొజ్జగణపయ్య నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడుగురు వ్యక్తులు నీటమునిగి చనిపోయారు.
బుల్ డోజర్ ప్రభుత్వంగా దేశ వ్యాప్తంగా సంచలన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొనింది. పసిపిల్లలైన విద్యార్ధులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు.