Home / Nasal vaccine
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం మొదలయ్యింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీనితో మరో కొత్తరకం వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా ఉపయోగించే భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ iNCOVACC ధరను ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800 మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 325 గా కేంద్రం మంగళవారం ఆమోదించింది.
కోవిడ్ -19 నివారణకు నాసల్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మంతా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని దేశాలు కరోనా ఎఫెక్ట్ తో దారుణమైన రోజులను చూడాల్సివచ్చింది.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డిజిసిఐ) హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ యొక్క ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌కు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం కోసం మంగళవారం అనుమతి ఇచ్చింది.