Home / moon
ఇస్రో చంద్రయాన్ త్రీ ప్రయోగం మరో మైలురాయిని చేరింది. ఇస్రో స్టేషన్నుంచి అందిన ఆదేశాలతో విక్రమ్ ల్యాండర్ చందమామపై మరోసారి ల్యాండైంది. మిషన్ లక్ష్యాలని అధిగమించి ల్యాండర్ పని చేస్తోందని ఇస్రో ట్వీట్ చేసింది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మూన్ రోవర్ గురించి ‘X’ (గతంలో ట్విట్టర్)లో కొత్త అప్డేట్ను పోస్ట్ చేసింది.సురక్షితమైన మార్గం కోసం రోవర్‌ను తిప్పారు. భ్రమణం ల్యాండర్ ఇమేజర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడింది. చందమామ పెరట్లో చిన్నపిల్ల ఆడపడుచుగా ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తోంది. కాదా? అంటూ ఇస్రో వ్రాసింది.
ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం ఇవాళ ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. నేడు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.