Home / MLA Vallabhaneni Vamsi
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ సంకల్పసిద్ది కుంభకోణం వెనక వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమేయం వుందని ప్రచారం జరుగుతోంది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్పు పై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. తెదేపా నేతలతోపాటుగా పలు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో నిరసిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గంధరగోళం పరిస్ధితులు ఏర్పడ్డాయి.