Home / millets
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్‌లు) మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది భోజనంలో మిల్లెట్స్ ను ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
చిరుధాన్యాలకు పునర్వైభవం వస్తోంది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, పండిచడం లాంటివి చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం మెండు కాబట్టి యావత్ ప్రజలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. దానితో రైతులు సైతం వీటి సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మరి చిరుధాన్యాల సాగుకు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసేద్దాం.
ఈ ఆర్థిక సంవత్సరం నుండి సైనికులకు రేషన్‌లో తృణధాన్యాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సైనికులు తీసుకునే ఆహారం జీవన శైలి వ్యాధులను అరికట్టేవిధంగా మన భౌగోళిక వాతావరణ పరిస్దితులకు సరిపడే విధంగా ఉండాలని భావించారు.
Millets: ఆరోగ్యాన్ని కాపాడటంలో చిరుధాన్యాల పాత్ర కీలకమైంది. దీంతో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఈ చిరు ధాన్యాల సాగులో సరైన మెళకువలు పాటిస్తే.. మంచి లాభాలు పొందవచ్చు.