Home / medical colleges
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు.
ప్రస్తుతమున్న వైద్య కళాశాలలకి తోడు తెలంగాణలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు రానున్నాయి. ప్రతి జిల్లాకి ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 9 ఏళ్ళల్లో 29 కొత్త మెడికల్ కళాశాలలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
హైదరాబాద్లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.