Home / Manipur violence
మణిపూర్‌లో జాతి హింసకు సంబంధించిన అంశంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ కమిటీ మానవతా దృక్పథాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించి కొనసాగుతున్న దర్యాప్తు పరిధిని దాటి తన పరిధిని విస్తరిస్తుందని ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ ప్రకటించారు.
శుక్రవారం అర్థరాత్రి మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తాజా హింసాత్మక సంఘటనలలో కనీసం ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారు.తాజా హింసాకాండలో, కుకీ వర్గానికి చెందిన ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా ప్రాంతంలో కుకీ వర్గానికి మరియు భద్రతా బలగాలకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. మణిపూర్ పోలీసులు, కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు.
మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం మళ్లీ వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో గందరగోళం కొనసాగుతుండగా, ప్రతిపక్షాలు ప్రధానమంత్రి సభ వెలుపల ఎందుకు మాట్లాడుతున్నారు కాని లోపల ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి.
Manipur women: గత కొంతకాలంగా మణిపూర్ అట్టుడుకుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ రెండు తెగల అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈనెల 29,30 తేదీల్లో రాహుల్ మణిపూర్‌లో పర్యటిస్తారని, మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
Manipur Violence: మణిపూర్‌లో కొద్దిరోజులుగా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమాలు మరింత హింసాత్మకంగా మారాయి. దీనితో ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుంది.
:మణిపూర్‌లోని కుకీ గిరిజన సంఘం సభ్యులు ఈరోజు న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు నిరసన చేపట్టారు. ఈ ఉదయం ఆందోళనకారులు షా నివాసానికి చేరుకుని ఆయనను కలవాలని డిమాండ్ చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. హోంమంత్రి నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కొద్దిమంది నిరసనకారులను షాను కలిసేందుకు అనుమతించారని సమాచారం.
మణిపూర్‌లో చెలరేగిన హింసపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ITLF) కార్యదర్శి మువాన్ టోంబింగ్ కు హామీ ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో విచారణ చేపడతామని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని అమిత్ షా కోరారు.