Home / latest Telangana news
హైదరాబాద్ లోటస్ పాండ్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. లోటస్ పాండ్‌లో రోడ్డును ఆక్రమించి వైఎస్ ఫ్యామిలీ నిర్మాణాలు చేపట్టింది.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగించకుండా... కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులు పరిశీలిస్తున్నామని కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్ అన్నారు. హైదరాబాద్ లో విలేకరులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి సీతారామ చంద్రస్వామివారి ఆలయ పరిసరాలన్నీ నీట మునిగాయి
రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన మీర్ పేట్ కార్పొరేటర్ నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 90 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక విద్యుత్ వినియోగదారునికి రూ.21 కోట్ల బిల్లు రావడంతో షాక్ తిన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేసింది. మాస్టర్ క్వశ్చన్ పేపర్ మరియు ఎగ్జామ్ కీ TGPSC అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) - 2024 ఫలితాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రకటించారు. ఈ పరీక్షకు 2,86,381 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
సింగరేణి కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
చత్తీస్గడ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జులై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.