Last Updated:

Revanth Reddy: బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుంది.. సీఎం రేవంత్ రెడ్డి

: బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందని రేవంత్ అన్నారు.

Revanth Reddy: బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుంది.. సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగిందని రేవంత్ అన్నారు.

బలహీన అభ్యర్థులను దింపారు..(Revanth Reddy)

బీజేపీని గెలిపించేందుకే బీఆర్‌ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ ఓట్లను బీజేపీకి మళ్లించారని, కేసీఆర్‌, హరీశ్‌లు కలిసి మెదక్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయాన్ని సాధించారని, బలహీన అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ నేతల గెలుపునకు కేసీఆర్‌ కృషి చేశారని తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 41 శాతానికి పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే కీలక హామీలను అమలు చేయడం వల్ల దీనికి కారణమని రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఓట్ల శాతం అసెంబ్లీ ఎన్నికలలో పొందిన 37.5 శాతం నుండి 16.5 శాతానికి పడిపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, ఆయన కూడా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. ‘మోదీ హామీకి వారంటీ లేదు.. ప్రజలు మోదీని తీర్పునిచ్చి తిరస్కరించారు.. ఆయన మళ్లీ ప్రధాని పదవిని చేపట్టకూడదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: