Published On:

Kakinada: సామర్లకోట మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ రాజీనామా

Kakinada: సామర్లకోట మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ రాజీనామా

Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి.. తన ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన అరుణ కృష్ణమూర్తి.. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇవాళ తన పదవికి  రాజీనామా చేసిన ఆమె.. మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యకు తన రాజీనామా లేఖను అందజేశారు. అంతుకుముందు సామర్లకోట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణపై సొంత పార్టీ వైసీపీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస సమావేశానికి గంట ముందే ఛైర్‌పర్సన్ పదవికి అరుణ రాజీనామా చేశారు.  స్పచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఈ రోజు ఉదయం 11 గంటలకు చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మాణం ఉంది. ఇందుకుగాను ప్రత్యేక సమావేశం జరుగనుండగా అంతకు ముందే గంగిరెడ్డి అరుణ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం తొమ్మిది గంటలకు తన రాజీనామాను మున్సినల్ కమిషనర్ అనిశెట్టి శ్రీవిద్యకు అందించారు. దీంతో నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది. రాజీనామా అనంతరం దేశ నాయకుల చిత్రపటాలకు వందనం చేశారు. కొత్త చైర్ పర్సన్ ను ఎప్పుడు ఎంపిక చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: