Home / latest Telangana news
దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్ నేతృత్వంలో జరగనున్న ఈ పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో ఈసారి భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారు.
బీఆర్ఎస్ కి చెందిన బెల్లంపలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో బాధితురాలు రసిన ఫిర్యాదుకు మహిళా కమిషన్ స్పందించింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈ నెల 5న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్లో సిబిఐ పలు అంశాలు ప్రస్తావించింది.
వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష రాసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. హత్యా స్థలిలో లభించిన లేఖని 2021 ఫిబ్రవరి 11న సిబిఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే తేల్చింది.
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. అవార్డులు, రివార్డుల్లో తెలంగాణ ముందుందని చెప్పారు. అందరం కలిసి కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పారు.
మార్గదర్శి చిట్స్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడి అధికారులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ రామోజీరావు నివాసానికి చేరుకున్న ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌ని ప్రశ్నిస్తున్నారు
9th Nizam Nawab: నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 57వ వర్ధంతి సందర్బంగా నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మరో వారంరోజులపాటు ధాన్యం కొనుగోళ్లను కొనసాగించాలని భావిస్తోంది. జూన్ 10 నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేసి ఈ సీజన్ ను ముగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జనవరి 18న ఖమ్మంలో ప్రారంభించిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.6 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు.