Home / latest Telangana news
వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష రాసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. హత్యా స్థలిలో లభించిన లేఖని 2021 ఫిబ్రవరి 11న సిబిఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే తేల్చింది.
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. అవార్డులు, రివార్డుల్లో తెలంగాణ ముందుందని చెప్పారు. అందరం కలిసి కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పారు.
మార్గదర్శి చిట్స్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడి అధికారులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ రామోజీరావు నివాసానికి చేరుకున్న ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌ని ప్రశ్నిస్తున్నారు
9th Nizam Nawab: నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 57వ వర్ధంతి సందర్బంగా నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మరో వారంరోజులపాటు ధాన్యం కొనుగోళ్లను కొనసాగించాలని భావిస్తోంది. జూన్ 10 నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేసి ఈ సీజన్ ను ముగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జనవరి 18న ఖమ్మంలో ప్రారంభించిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమంలో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.6 కోట్ల మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు.
Katakam Sudarshan: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో ఆయన మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ ప్రకటించింది. కటకం సుదర్శన్ అలియాస్ కామ్రేడ్ ఆనంద్ 69 సంవత్సరాల క్రితం ఒక కూలీ కుటుంబంలో జన్మించాడు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఒక పండుగలా జరుగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల పాటు ఈ వేడుకలను జరపనున్నారు. అందులో భాగంగా రాజధాని నగరం హైదరాబాద్ లో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ హాజరయ్యారు. తొలుత గన్‌పార్క్‌లో స్థూపం వద్ద అమరవీరులకు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటీతో తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకొని 10 వ వసంతం లోకి అడుగు పెడుతుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే విధంగా సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దద్దరిల్లేలా
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్