Home / latest Telangana news
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకువెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మనిషని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికేనని రేవంత్ స్పష్టం చేశారు.
బలిజ సోదర సోదరీమణులు తమ పిల్లల కోసం సంఘం అధ్యర్యంలో నిర్వహించే వివాహ వేదికలను వాడుకోవాలని కాపునాడు అధ్యక్షులు మరియు శ్రీకృష్ణదేవరాయల ఆల్ ఇండియా అధ్యక్షులు నారాయణస్వామి రాయల్ సూచించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్ష మార్పుపై జరుగుతున్న చర్చ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తమ పార్టీలో లీకులకు తావుండదని బండి సంజయ్ అన్నారు.
: పూజారి ప్రియుడి చేతిలో శంషాబాద్‌లో హత్యకు గురైన అప్సర కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకి మూడేళ్ళ కిందట చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్ళైందని పోలీసుల విచారణలో తేలింది. కానీ భర్తతో విబేధాల కారణంగా ఏడాది కిందట సరూర్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రికి బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికారు.
నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల
శంషాబాద్‌లో అర్చకుడి చేతిలో దారుణ హత్యకి గురైన అప్సర అసలు ఇంటినుంచి ఎలా వెళ్ళింది.? ఎక్కడెక్కడ తిరిగారు.? ఏం చేశారు.? అర్చకుడు సాయి ఆమెని హత్య చేసేందుకు ఎంతకాలంగా ప్లాన్ చేస్తున్నాడు.? ఏ ఆయుధంతో అప్సరని మట్టుబెట్టాడు.? ఇలాంటి విషయాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
నిత్యం పూజలు చేస్తూ భక్తిలో మునిగి తేలే అర్చకుడు ఓ మహిళని చంపేశాడు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి వివరాలివి. హైదరాబాద్ సరూర్ నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న వెంకట సాయి సూర్య కృష్ణకి ఆలయంలో పరిచయం అయిన అప్సర అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.
హపీజ్ పేట్ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు పోగుల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొనగా.. కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, మున్నూరు