Home / latest Telangana news
ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబంతో కలిసి కారుకొండలో తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుకు గురయ్యారని తెలుస్తుంది. దీంతో వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. జులై 2న కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా వారు తెలిపారు.
Ponguleti – Jupalli: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో జులై మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు భారీగా మాదకద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని టోలీచౌకిలో ముంబైనుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి అమ్ముతున్న ఇర్ఫాన్‌ని పోలీసులు పట్టుకున్నారు. మఫ్టీలో మాటువేసి పట్టుకున్న ఫిలింనగర్ పోలీసులు ఎనిమిది పాయింట్ అయిదు ఆరు గ్రాముల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు.
టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు
హైదరాబాద్‌లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.
వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ తెరకెక్కారు. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధించారని గతంలో సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మళ్ళీ మీడియా ముందుకి వచ్చారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై సమాలోచనలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన వేళ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల లోన్‌కు అప్లై చేసుకునేందుకు బీసీలు తిప్పలు పడుతున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహశీల్దార్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.