Home / latest Telangana news
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా గెలిచారు. అయితే జలగం వెంకట్రావు రెండో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే వనమా సమర్పించిన అఫిడవిట్లో తేడాలున్నాయంటూ జలగం వెంకట్రావు హైకోర్టుని ఆశ్రయించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌తో పాటు.. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు మెల్లిమెల్లిగా ముందుకుసాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి ఇప్పుడు నిజమైన ఊటిగా మారింది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా జలపాతాలు జాలువారుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసి పర్యాటకులే కాదు స్ధానికులు కూడా మైమరిచిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు.
జనగామ పోలీసు స్టేషన్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి చేరుకున్నారు. తన విధులకి ఆటంకం కలిగిస్తోందంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో తుల్జా భవాని రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
Telangana: రోజురోజుకి కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ వంటి కూరగాయలు అన్నీ మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి.
హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్లో జరిగిన కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని సినీ నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజగా పోలీసులు గుర్తించారు. శంభో శివశంభో, వినాయకుడు తదితర చిత్రాలలో సూర్యతేజ నటించాడు. ఈ కాల్పుల కేసుకి సంబంధించి మనోజ్, స్మితని షామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు
హైదరాబాదులో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా దగ్గర సింహవాహిని బోనాల పండగ సందర్భంగా.. ఆలయ కమిటీ తొలి బోనం సమర్పించింది. ప్రభుత్వం తరఫును మంత్రి తలసాని శ్రీనివివాస్ యాదవ్.. అమ్మవారికి అదికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.