Home / latest Telangana news
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య పరోక్షంగా స్పందించారు. గోబెల్స్ ప్రచారం నమ్మవద్దని రాజయ్య కార్యకర్తలకి విజ్ఞప్తి చేశారు. ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అంటున్నారు కదా.? నేను ఛాలెంజ్ చేస్తున్నా .. కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రాజయ్య అన్నారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ స్కూల్ లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటించనున్న సందర్భంగా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బంధీగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.
గురుకులాల్లో పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గురువారం టీఎస్పీఎస్సి కార్యాలయాన్నిముట్టడించారు. టీఎస్పీఎస్సి కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అభ్యర్ధుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం ఖరారైంది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేలను సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Mahabubabad: ప్రతిరోజు నిత్యావసరంగా వాడుకున్నే కూరగాయల్లో టమాట ఒకటి. మధ్యతరగితి ఆపిల్ పండుగా పిలుచుకునే టమాటా ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
ప్రస్తుతమున్న వైద్య కళాశాలలకి తోడు తెలంగాణలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు రానున్నాయి. ప్రతి జిల్లాకి ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 9 ఏళ్ళల్లో 29 కొత్త మెడికల్ కళాశాలలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు
తనకి పదవులు కావాలంటూ ఇంతకాలం పార్టీ అధిష్టానం దగ్గర విన్నపాలు వినిపించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇప్పుడు జోరు పెంచారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ రావు ఇంకో అడుగు ముందుకేశారు