Home / latest Telangana news
జనగామ పోలీసు స్టేషన్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి చేరుకున్నారు. తన విధులకి ఆటంకం కలిగిస్తోందంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో తుల్జా భవాని రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
Telangana: రోజురోజుకి కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ వంటి కూరగాయలు అన్నీ మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి.
హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్లో జరిగిన కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని సినీ నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజగా పోలీసులు గుర్తించారు. శంభో శివశంభో, వినాయకుడు తదితర చిత్రాలలో సూర్యతేజ నటించాడు. ఈ కాల్పుల కేసుకి సంబంధించి మనోజ్, స్మితని షామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు
హైదరాబాదులో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా దగ్గర సింహవాహిని బోనాల పండగ సందర్భంగా.. ఆలయ కమిటీ తొలి బోనం సమర్పించింది. ప్రభుత్వం తరఫును మంత్రి తలసాని శ్రీనివివాస్ యాదవ్.. అమ్మవారికి అదికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్లో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులకి బాధితుడు సిద్దార్థ్ దాస్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు సీరియల్ నటుడు మనోజ్ సెలబ్రిటీ క్లబ్ రిసార్ట్స్‌లో ఒక విల్లాలో సిద్దార్థ అనే వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
సినీ హీరో కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు షాద్ నగర్ లో మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లారు.
Metro Train: హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేస్తున్న భాగ్యనగర మెట్రో సేవలు ఇప్పుడు మరింత విస్తృతం కానున్నాయి. నగరంలో మరో మార్గంలోనూ మెట్రో రైలు కూత పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో మూడు ప్రధాన మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను ఇప్పుడు పాత బస్తీ వరకు విస్తరించనున్నారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య బేషరతుగా తల్లులకు క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు. తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఏపీ, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని రాజయ్య అంటున్నారని మీ దగ్గర ఉన్న తన ఆస్తుల వివరాలు తీసుకురావాలని కడియం చెప్పారు. వారం రోజుల్లో ఆధారాలతో సహా రావాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాలోని ఇద్దరు కీలక నేతలకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్రం..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మరో కీలక ఘట్టం నిర్వహించారు. బోనాలలో భాగంగా చేపట్టే.. "రంగం" కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగింది. ముందుగానే జోగిని స్వర్ణలత చెప్పే భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో