Home / latest Telangana news
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ అన్నారు. పవన్ కొండగట్టు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు ఉదయం 7గంటలకు మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు పవన్ వెళ్తారని ఆయన అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. బి.జి కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంప్ హౌస్ ను పరిశీలించారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మిగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే.. మెట్రో ప్రయాణాలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, కామన్ పీపుల్స్ అంతా సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవాళ్లకి మెట్రో ట్రైన్స్ మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.
తెలంగాణలో తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. నిన్న అర్ధరాత్రి వరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించగా.. ఉస్మానియా జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారులు కార్పొరేషన్ యొక్క ప్రత్యేకమైన వాహన ట్రాకింగ్ సిస్టమ్ నెట్‌వర్క్‌లోని ‘TGSRTC గమ్యం యాప్’లో అన్ని లగ్జరీ, ఎయిర్ కండిషన్డ్ మరియు ఎలక్ట్రిక్ బస్సులను చేర్చే ప్రక్రియను వేగవంతం చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని కలవటం పై ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను సవరిస్తామని మాట్లాడుతూ.. మరో వైపు అందుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వైద్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల క్వార్టర్స్‌లో దామోదరతో జూడాలు చర్చించారు. కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్ఎంసి) రోనాల్డ్ రోస్తో సహా తెలంగాణలోని పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. గత కొద్ది రోజులకిందట పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఆపుడు ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం.
జంట నగరాల ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు పెరిగిపోతున్న కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ర్ట జనాభాలో 50 శాతం మంది ప్రజలు పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్నారని తేల్చింది.