Home / latest Telangana news
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు దారి పొడగునా.. అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కేరింతల మధ్య.. పవన్ కొండగట్టుకు చేరుకుని.. అంజన్నను దర్శించుకున్నారు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ చనిపోయారు. స్వగ్రామం ఉట్నూరులోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని అంబులెన్సులో హైదరాబాద్ కి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవితను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం కలిశారు.ఈ సందర్బంగా ఆమె యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్బంగా తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీసినట్లు సమాచారం.
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.. కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాలె యాదయ్యకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాలె యాదయ్య చేరికతో.. ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లైంది.
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ అన్నారు. పవన్ కొండగట్టు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. రేపు ఉదయం 7గంటలకు మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు పవన్ వెళ్తారని ఆయన అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. బి.జి కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంప్ హౌస్ ను పరిశీలించారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మిగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే.. మెట్రో ప్రయాణాలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, కామన్ పీపుల్స్ అంతా సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవాళ్లకి మెట్రో ట్రైన్స్ మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.