Last Updated:

Kaleswaram Inquiry Commission: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమీషన్ గడువు పొడిగింపు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ పదవీకాలాన్ని రెండు నెలలు పొడిగించారు. మేడిగడ్డ, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లోని రెండు బ్యారేజీల నిర్మాణంపై ఈ కమిషన్‌ విచారణ జరుపుతోంది. దీనిపై హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాల్లో కమిషన్ పలు దఫాలు పర్యటించింది.

Kaleswaram Inquiry Commission: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమీషన్ గడువు పొడిగింపు

 Kaleswaram Inquiry Commission: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ పదవీకాలాన్ని రెండు నెలలు పొడిగించారు. మేడిగడ్డ, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లోని రెండు బ్యారేజీల నిర్మాణంపై ఈ కమిషన్‌ విచారణ జరుపుతోంది. దీనిపై హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాల్లో కమిషన్ పలు దఫాలు పర్యటించింది.

జూలైలో పబ్లిక్ హియరింగ్..( Kaleswaram Inquiry Commission)

జూన్ 30లోగా నివేదిక అందజేయాలని కమిషన్ భావించింది. అయితే విచారణ ప్రక్రియ పూర్తికాలేదు. దీనితో గడువు తేదీని ఆగష్టు 31 వరకు పొడిగించారు. బ్యారేజీల ప్రణాళిక మరియు నిర్మాణానికి సంబంధించిన వ్యక్తులు మరియు ఏజెన్సీల నుండి సమాచార సేకరణకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును కమిషన్ పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌ అధికారులను అఫిడవిట్‌లు దాఖలు చేయాలని కమీషన్ ఈ నెల మొదటి వారంలో ఆదేశించింది. ఇప్పటివరకు 60 మంది అఫిడవిట్లు దాఖలు చేసారు. జూలై మొదటి వారం నుంచి కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించబోతోంది.

ఇవి కూడా చదవండి: