Last Updated:

Ramesh Rathode passed away: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ చనిపోయారు. స్వగ్రామం ఉట్నూరులోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని అంబులెన్సులో హైదరాబాద్ కి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

Ramesh Rathode passed away: మాజీ ఎంపీ  రమేష్ రాథోడ్ కన్నుమూత

Ramesh Rathode passed away: ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ చనిపోయారు. స్వగ్రామం ఉట్నూరులోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని అంబులెన్సులో హైదరాబాద్ కి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

టీడీపీ నుంచి రాజకీయ ప్రస్దానం..(Ramesh Rathode passed away)

రమేశ్ రాథోడ్ తొలి సారిగా తెలుగు దేశం పార్టీ నుండి నార్నూర్ జడ్పీటిసి గా ఎన్నికయ్యారు.ఖానాపూర్ (ఎస్టీ రిజర్వడ)శాసన సభ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నుండి రెండు సార్లు శాసన సభ్యునిగా సేవాలందించారు. రమేష్ రాథోడ్ 1999 – 2004 మద్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యునిగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 2009 లో 15 వ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యుని గా పనిచేసారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. కొద్ది కాలంలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెష్ పార్టీలో చేరారు. ఖానాపూర్ శాసన సభకు, ఆదిలాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు.ఆనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలగి 2021లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. 2023లో ఖానాపూర్ అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుండి పోటి చేసి ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి: