Home / Latest News
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా ఆయన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో చీపురు పట్టి ఊడ్చారునేటి నుండి, దేశంలోని భారతీయ రైల్వేలు, పోస్టాఫీసులు, టెలికాం, ఐటీ మరియు ఇతర విభాగాలలో పరిశుభ్రత కోసం ప్రచారం ప్రారంభమైంది.
భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.
దేశం గర్వించదగిన డైరెక్టర్ శంకర్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుంది అంటారు. అదిరిపోలా ఊహకే అది అద్భుతంగా ఉంటే ఇంక సినిమా వస్తే ఎట్లుందంటారు... బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే కదా..
ఈరోజు అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ కొన్ని చెడువి జరిగిన వాటికి నిరాశపడకుండా అంతా మనమంచికే జరుగుతుందనే చింతనతో పనులలో ముందుకు కదలండి. కుటుంబంతో సంతోషంగా కొంత సమయం గడపండి.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్‌ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
జార్ఖండ్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు నీటిలో చిక్కుకున్నారు.
నేపాల్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 17మంది మృతిచెందారు. ఈ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.
దేశమంతా ఆధార్ నెంబరుకు ఓటరు కార్డు లింక్ చేసుకోవాలన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది
తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.